కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగులను మళ్లీ ఆఫీసులకు రావాలని ఆయా సంస్థలు తెలిపాయి. మరోవైపు యాప్స్ వినియోగం కూడా బాగా పెరగడంతో ఐటీకి భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు పలు సంస్థలు రిక్రూట్ మెంట్ చేసుకుంటున్నాయి. తాజాగా ఈ ఏడాది దేశంలో 60 వేల మందిని నియమించుకోనున్నట్లు ఫ్రాన్స్ ఐటీ సంస్థ క్యాప్‌జెమినీ తెలిపింది. వారిలో ఫ్రెషర్స్ ను తీసుకోనున్నట్లు సమాచారం.