ఇటీవలే ప్రారంభమైన సూపర్‌ఫాస్ట్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మరో ప్రమాదానికి గురైంది. నిన్న గేదెల మందను ఢీకొట్టడంతో రైలు ముందుభాగం దెబ్బతింది. తాజాగా మరోసారి గాంధీనగర్ నుంచి ముంబయి వెళ్తున్న వందేభారత్ రైలు ఆవును ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో పెద్దగా నష్టమేమీ జరగలేదు. రైలు ముందుభాగంలో చిన్న డెంట్ పడింది. గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ రైలును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. అక్టోబర్ 1 నుంచి ప్రయాణికులకు ఈ రైలు సేవలు అందిస్తోంది.
వందే భారత్ రైలుకు మరో ప్రమాదం

© ANI Photo