వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు మరో ప్రమాదం చోటు చేసుకుంది. గాంధీనగర్-ముంబయిల మధ్య ఇటీవలే ప్రారంభమైన రైలును గుజరాత్ అతుల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ పశువు ఢీకొట్టింది. దీంతో రైలు డ్రైవర్ బోగీ నోస్ కోన్ కవర్ ధ్వంసమైందని రైల్వే శాఖ వెల్లడించింది. అయితే పశువులు ఢీకొట్టడాన్ని కట్టడి చేయలేమని.. రైలు డిజైనింగ్లోనే మార్పులు చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కాగా, వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును పశువులు ఢీకొట్టడం ఇది మూడో సారి.