తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ఐటీ మినిష్టర్ కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రసిద్ధి చెందిన కాల్‌అవే గోల్ఫ్ కంపెనీ హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ డిజిటెక్ సెంటర్ ఏర్పాటుతో 300 మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్‌కు ఉపాధి లభించనుంది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ కంపెనీ అమెరికా తరువాత హైదరాబాద్‌లోనే అతిపెద్ద డిజిటెక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు.