జైలుకెళ్లొచ్చినా కూడా గ్యాంగ్‌స్టర్ అయూబ్ ఖాన్ తీరు మారలేదు. అయూబ్ ఖాన్‌పై హైదరాబాద్‌లోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. భూమి కబ్జా విషయంలో తమని బెదిరింపులకు గురిచేస్తున్నాడని యజమాని ఫిర్యాదు చేశారు. భూమిని విడిచి వెళ్లకపోతే తనని, తన కుమారులను చంపేస్తానని బెదిరించాడని జమీలున్నీసా బేగం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 384, 511 కింద అయూబ్ ఖాన్‌పై కేసు నమోదు చేసినట్లు హుస్సేనీఆలం ఎస్సై వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, అయూబ్ ఖాన్ కదలికలపై నిఘా ఉంచామని ఎస్సై తెలిపారు.