విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. సౌరాష్ట్రపై జరిగిన మ్యాచ్లో ఇవాళ మరో సెంచరీ చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు నెమ్మదిగా ఆడుతూ తొలి అర్ధ సెంచరీ 96 బంతుల్లో చేసి ఆ తర్వాత మరో 29 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇటీవల ఒకే ఓవర్లో 6 సిక్సులతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ట్రోఫీలో వరుసగా సెంచరీల వరద పారిస్తున్నాడు.