ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు మరో డీఏ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డీఏను ఫిబ్రవరి నెల వేతనంతో కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రయాణికులకు స్మార్ట్ కార్డు సదుపాయం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు కూడా పెంచే ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.