బంగ్లాతో సిరీస్‌ను చేజార్చుకున్న భారత్‌ను గాయాల కష్టాలు వెంటాడుతున్నాయి. బొటన వేలి గాయంతో రోహిత్ శర్మ భారత్‌కు వస్తుండగా.. పేసర్లు దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ సైతం మూడో వన్డేకు దూరమయ్యారు. రోహిత్‌కు ముంబయిలో స్పెషలిస్టు డాక్టర్‌తో చికిత్స అందించనున్నారు. బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు కూడా రోహిత్ అందుబాటులో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది. కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం రోహిత్ అందుబాటుపై కచ్చితంగా చెప్పలేనని పేర్కొన్నారు.