సాధారణంగా గుడ్డులో ఏముంటుంది ? పచ్చ సొన ఉంటుంది. కానీ ఈ గుడ్డులో మరో గుడ్డు బయటపడింది. అవును చదివింది నిజమే. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్లో ఈ సంఘటన జరిగింది. ఆమ్లెట్ వేసేందుకు గుడ్డును పగులగొట్టిన హోటల్ యజమానికి మధర్బాయి, ఆ గుడ్డులో మరో గుడ్డు ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ వింత అక్కడే ఉన్న జనాలకు తెలియడంతో.. గుడ్డు లోపల ఉన్న మరో గుడ్డును చూసేందుకు జనం ఎగబడ్డారు.