కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం వరించింది. 3000 మీటర్ల పురుషుల స్టీపుల్ చేజ్ ఫైనల్‌లో భారత అథ్లెట్.. అవినాష్ ముకుంద్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 3000 మీటర్ల దూరాన్ని కేవలం 8:11.20నిమిషాల్లో పూర్తి చేసి జాతీయ రికార్డు సృష్టించాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 27కు చేరుకుంది.