ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం దాడి నేపథ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందారు. అయితే పంజాబ్‌కు చెందిన విద్యార్థి చందన్ జిందాల్ (22) ఆనోరోగ్యంతో మరణించినట్లు తెలుస్తోంది. చందన్ ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాడు. జిందాల్ కు ఇస్కీమిక్ స్ట్రోక్‌తో రావడంతో ఆస్పత్రికి తరలించడంతో మృతి చెందినట్లు సమాచారం. అతని మృతదేహాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని అతని తండ్రి భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. మరోవైపు ఒకరోజు క్రితం ఖార్కివ్‌లో మరణించిన కర్ణాటకకు చెందిన విద్యార్థి మృతదేహాన్ని కూడా తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.