ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు భారత అత్యున్నత న్యాయస్థానంలోనూ ఎదురుదెబ్బ తగిలింది. గూగుల్‌కు వ్యతిరేకంగా సీసీఐ దర్యాప్తులో ఎలాంటి లోటుపాట్లు లేవని సుప్రీం తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ దగ్గర తేల్చుకోవాలని సూచించింది. వారంలోగా సీసీఐ విధించిన జరిమానాలో 10 శాతం కట్టాలని ఆదేశించింది. కాగా సీసీఐ గూగుల్‌కు రూ.1337 కోట్ల ఫైన్ విధించింది. దీనిపై గూగుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా కేసును విచారించింది.