ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం1 నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ జీఓను జనవరి 23 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. స్వాతంత్య్రానికి ముందు ఇలాంటి జీఓలు ఇచ్చి ఉంటే స్వాతంత్య్ర ఉద్యమం జరిగేదా అని ప్రశ్నించింది. గత 75 ఏళ్లుగా రోడ్లపై ఎవరూ సభలు, సమావేశాలు నిర్వహించలేదా అని నిలదీసింది. కేసు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.