ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ

© ANI Photo

మహరాష్ట్ర రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. తిరుగుబాటు బాట పట్టిన ఏక్‌నాథ్‌ షిండే వర్గ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు గడువును జూలై 12కు పొడిగించింది. అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ షిండే వేసిన పిటిషన్ పై సుప్రీం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా, 39 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 11కు వాయిదా వేస్తూ, ఉపసభాపతి, మహా సర్కారు, పోలీసులకు.. నోటీసులు జారీ చేశారు. అయితే శాసనసభలో బలపరీక్ష నిర్వహించకుండా ఆదేశాలివ్వాలంటూ సర్కారు వేసిన పిటిషన్ పై మాత్రం …. మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది.

Exit mobile version