కాంగ్రెస్‌కు మరో షాక్.. అయిదుగురు నేతలు రాజీనామా

© ANI Photo

కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయగా.. తాజాగా ఆయనకు మద్దతుగా మరో అయిదుగురు నేతలు రాజీనామా చేశారు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన GM సరూరి, హాజీ అబ్దుల్ రషీద్, మొహమ్మద్ అమీన్ భట్, గుల్జార్ అహ్మద్ వానీ, చౌదరి మొహమ్మద్ అక్రమ్‌లు తమ పదవులకు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు.

Exit mobile version