రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా, శివాత్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘రంగమార్తాండ’ సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ విడుదలైంది. ‘పొదల పొదల గట్ల నడుమ’ అంటూ సాగే సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇదివరకే ఈ చిత్రం నుంచి 3 పాటలు విడుదల చేశారు. ఆ పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ మార్చి 22న రిలీజ్ కానున్నట్లు టాక్.