పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా, గెహన సిప్పి హీరోయిన్గా జార్జిరెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి ‘చోర్ బజార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాతబస్తీ నేపథ్యంలో సాగే ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా నూనూగు మీసాల పోరడు అనే పాటను విడుదల చేశారు. లక్ష్మీ మేఘన పాడిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.