ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప 2కి సంబంధించి క్రేజీ వార్త వినిపిస్తోంది. ఇందులో ఓ అతిథి పాత్ర ఉందట. దీనికోసం ఎవరైనా స్టార్ హీరోను సంప్రదించాలని యూనిట్ భావిస్తుందని టాక్. మెుత్తం మీద సీక్వెల్లో కొన్ని కీలకపాత్రలతో పాటు మరికొన్ని కొత్తవి పరిచయం కానున్నాయి. ప్రముఖ నటీనటులు కూడా ఉంటారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.