త్వరలో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాాజాగా కియారా ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ‘‘ఈ సీక్రెట్‌ను ఎక్కువ కాలం దాచలేను. డిసెంబర్ 2న వెల్లడిస్తా. వేచి చూడండి’’ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సిద్ధార్థ్‌ను పెళ్లి చేసుకుంటున్నారా అని ఓ అభిమాని ప్రశ్నించాడు. కాగా కియారా, సిద్ధార్థ్ మల్హోత్రాలు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. పార్టీలకు, ట్రిప్‌లకు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు.