అత్యాధునిక సాంకేతికతలతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ..డిజిటల్ దిశగా మరో ముందడుగు వేసింది. ప్రపంచస్థాయి పౌరసేవలు అందించేలా మాస్టర్‌కార్డ్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా రాష్ట్రం ఎంఓయూ కుదుర్చుకుంది. డిజిటల్ లిటరసీ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం తదితర రంగాల్లో మాస్టర్‌కార్డ్ ప్రభుత్వానికి సహకరించనుంది. చిన్న,మధ్యతరహా వ్యాపారాలు రైతులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ ఒప్పందం కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు డిజిటల్ తెలంగాణ విజన్‌లో భాగస్వాములవడం సంతోషంగా ఉందని వివరించారు.