దిల్లీలో కారు కింద చిక్కుకుని 13 కిలోమీటర్లు నరకయాతన అనుభవించి చనిపోయిన అంజలి సింగ్ ఘటనకు సంబంధించిన కేసు మరో మలుపు తిరిగింది. ప్రమాద సమయంలో తనతో పాటు ఉన్న అంజలి సింగ్ స్నేహితురాలు నిధి.. అంజలి మద్యం సేవించి వాహనం నడిపిందని స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే నిధి అంజలి ఫ్రెండే కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు. అలాగే అంజలికి మద్యం సేవించే అలవాటు లేదని చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లోనూ మద్యం ఆనవాళ్లు లేని విషయాన్ని అంజలి ఫ్యామిలీ డాక్టర్ గుర్తుచేశారు. నిందితులతో నిధికి సంబంధం ఉండవచ్చని, ఆమెను గట్టిగా విచారించాలని, మృతురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.