• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • పోలవరంపై మరో మెలిక పెట్టిన కేంద్రం

    పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. తాజాగా కేంద్రం సామాజిక ఆర్థిక సర్వే మరోసారి నిర్వహించాలంటూ మరో మెలిక పెట్టింది. ఇప్పటికే ఈ సర్వే పూర్తవగా మరోసారి నిర్వహించామని ఆదేశాలివ్వడం గమనార్హం. దీంతో పాటు పోలవరం నిర్మాణానికి కేంద్రం కేవలం రూ.15 వేల 668 కోట్లు మాత్రమే ఇస్తుందని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేస్వర్ తుడు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రం రూ.14 వేల 336 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, అందులో రూ.12,311కోట్లు కేంద్రం తిరిగి చెల్లించిందని తెలిపారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పూర్తవడంపై మరోసారి అనుమానాలు మొదలయ్యాయి.