తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలు అప్లై చేసుకోవాలని యోచించే అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 3 సంవత్సరాల పాటు వయోపరిమితి సడలింపును ఇచ్చిన ప్రభుత్వాన్ని మరో రెండేళ్ల సడలింపు ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. దీనిపై సర్కారు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.