‘అంటే సుంద‌రానికి’ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్ట‌ర్స్

నాని హీరోగా న‌టిస్తున్న ‘అంటే సుంద‌రానికి’ నుంచి ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్లు విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ఒక పోస్ట‌ర్‌లో హీరో, హీరోయిన్‌ తెలుగు సాంప్ర‌దాయంలో పెళ్లి చేసుకునే వ‌దూవ‌రుల్లాగా క‌నిపిస్తే, మ‌రో పోస్ట‌ర్‌లో క్రిస్టియ‌న్ సాంప్ర‌దాయ వదూవ‌రులుగా క‌నిపిస్తున్నారు. న‌జ్రియా నేరుగా తెలుగులో న‌టిస్తున్న మొట్ట‌మొద‌టి సినిమా ఇది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని త‌మిళ‌, మ‌ల‌యాళంలో కూడా విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌టిచారు. ఏప్రిల్ 20న ‘అంటే సుంద‌రానికి’ టీజ‌ర్ రిలీజ్ కానుంది.

Exit mobile version