నాని హీరోగా నటిస్తున్న ‘అంటే సుందరానికి !’ సినిమా నుంచి నేడు హీరోయిన్ నజ్రియా ఫాహద్ టీజర్‌ను రిలీజ్ చేశారు. లీలా థామస్ పాత్రలో ఆమె అలరిస్తుంది. నజ్రియాకు ఇది తెలుగులో మొదటి సినిమా. కానీ రాజా రాణి, బెంగుళూరు డేస్ వంటి సినిమాలతో ఇప్పటికే ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అంటే సుందరానికి మూవీ జూన్ 10, 2022న విడుదల కాబోతుంది.