నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఈ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ హైటెక్ సిటీ శిల్ప కళా వేదికలో నిర్వహించనున్నారు. పవన్ రాక నేపథ్యంలో పొలిటికల్ గా ఎలాంటి కామెంట్లు చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో పవర్ స్టార్ అభిమానులు ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం రేపు విడుదల కానుంది.