నాని, నజ్రియా జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికి. జూన్ 10న థియేటర్లలో విడుదలైన సినిమా బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. అందరూ సినిమాపై, నటీనటులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివేక్ ఆత్రేయ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు. మొదటిసారిగా నజ్రియా తెలుగులో నటించడం, నాని మళ్లీ ఒక సరదా కుర్రాడి పాత్రలో కనిపించడం ప్రేక్షకులను మెప్పించింది. మూవీ సక్సెస్ అయిన సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది.