కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ కె ఆంటోనీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రధాని మోదీపై డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ అనిల్ ఆంటోనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ ఆ పోస్ట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ అతడిపై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో అసహనానికి గురైన అనిల్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌లో చెంచాగాళ్లు ఎక్కువయ్యారంటూ ఆయన ట్వీట్ చేశారు. మోదీకి మద్ధతుగా అనిల్ పోస్ట్ చేయడాన్ని కేరళ కాంగ్రస్ నేతలు తట్టుకోలేకపోయారు.