బీహార్లో జామూయ్ ప్రాంతంలో బంగారం నిల్వలు ఉన్నట్లు అప్పట్లో ప్రభుత్వం దృష్టికి వచ్చింది. 40 ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో ఉన్న మర్రి చెట్టు కింద చీమలు పెడుతున్న పుట్టల్లో స్థానికులు బంగారు రేణువులను గుర్తించారు. ఆ వార్త ప్రభుత్వానికి చేరడంతో తవ్వకాలు జరిపారు. అయితే ఈ ప్రాంతంలో బంగారు తవ్వకాలు చేపట్టాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గతేడాది లోక్సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశంలోని బంగారంలో 44 శాతం ఇక్కడ దొరుకుతుందని అన్నారు. వచ్చే నెలలో బీహార్ ప్రభుత్వం బంగారు గని తవ్వకాల కోసం కేంద్ర ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకోవచ్చని సమాచారం.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం