‘కార్తికేయ‌2’ ప్ర‌మోష‌న్స్‌లో క‌నిపించ‌ని అనుప‌మ.. కార‌ణ‌మిదేన‌ట‌!

Courtesy Instagram: anupama

నిఖిల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించిన ‘కార్తికేయ2’ మూవీ ఆగ‌స్ట్ 12న రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. కానీ అనుప‌మ‌ మాత్రం వీరితో ఏ కార్య‌క్ర‌మంలోనూ క‌నిపించ‌డంలేదు. దీంతో ఎందుకు ఆమె రావ‌ట్లేదు అనే ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. దీనిపై అనుప‌మ క్లారిటీ ఇచ్చింది. నేను ఇప్ప‌టికే ఒప్పుకున్న సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నాను. ఇవి చాలాకాలం ముందు ఒప్పుకున్న సినిమాలే. వాస్త‌వానికి కార్తికేయ 2 అనుకున్న స‌మ‌యానికి రిలీజ్ అయితే ఈ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఆల‌స్యం కావ‌డం కార‌ణంగా డేట్స్ స‌ర్ధుబాటు కాక‌పోవ‌డంతో ప్ర‌మోష‌న్స్‌కు రాలేక‌పోతున్నానని చెప్పింది.

Exit mobile version