సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన డీజే టిల్లు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ అంటూ వార్తలొచ్చాయి. కానీ తర్వాత అనుపమ పరమేశ్వరన్ నటిస్తోందని ప్రకటించారు. అయితే ప్రస్తుతం అనుపమ ఈ ప్రాజెక్టు నుంచి ఔట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ ఈ సినిమా చేయబోతోందని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.
-
Courtesy Instagram:anupama parameshwaran
-
Courtesy Instagram:Madonna Sebastian