షాక్‌లో అనుష్కశెట్టి.. కారణం అదే

Courtesy Instagram:ANUSHKA

టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్కశెట్టి కుటుంబం ప్రస్తుతం షాక్ లో ఉంది. అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్ శెట్టిని కొంత మంది చంపేందుకు యత్నిస్తున్నారట. ఆయన ఇదే విషయమై తనకు అదనపు భద్రత కల్పించాలని కర్ణాటక హోం మంత్రిత్వ శాఖను కోరాడు. గుణరంజన్ శెట్టి ఓ మాఫియా డాన్ కింద వర్క్ చేసేవాడు. ఆ డాన్ చనిపోయాక గుణరంజన్ శెట్టికి ఇతర వ్యక్తులతో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో సదరు వర్గం వారు గుణరంజన్ శెట్టిని చంపేందుకు ప్లాన్ వేశారట. మన్విత్ రాయ్ అనే వ్యక్తి గుణరంజన్ ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అతడు ఆరోపిస్తున్నాడు. మన్విత్ రాయ్ మాత్రం తాను విదేశాల్లో ఉంటున్నానని తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నాడు.

Exit mobile version