అనుష్క ఈ సినిమాలో మ‌రోసారి బొద్దుగా క‌నిపించ‌నుందా?

Courtesy Instagram: anushka

చాలాకాలం గ్యాప్ త‌ర్వాత అనుష్క యూవీ క్రియేష‌న్స్ నిర్మాణంలో ఒక చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌వీన్ పోలిశెట్టి ఇందులో హీరోగా న‌టిస్తున్నాడు. మ‌హేశ్‌.పి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే ఈ సినిమా గురించి ఒక ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ మూవీలో అనుష్క సైజీ జీరోలో క‌నిపించిన‌ట్లు బొద్దుగా కనిపించ‌నుంద‌ట‌.క‌థ డిమాండ్ చేయ‌డంతో ద‌ర్శ‌కుడి సూచ‌న మేర‌కు అనుష్క బ‌రువు పెరిగే పనిలో ఉన్న‌ట్లు స‌మాచారం. కానీ ఈ వార్త విన్న ఆమె అభిమానులు మాత్రం నిరాశ‌చెందుతున్నారు. బ‌రువు పెర‌గొద్దు స్వీటీ నువ్వు ఇలానే బాగుంటావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో తెలియాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే!

Exit mobile version