డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత రెజ్లర్లు ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉషకు లేఖ రాశారు. వినేశ్ ఫొగట్ ఆధ్వర్యంలో ఈ లేఖ రాశారు. లేఖలో ఏముందంటే..‘‘బ్రిజ్ భూషణ్ వల్ల తాము ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నాం. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడు. తక్షణమే రాజీనామా చేసేలా అతడిపై చర్యలు తీసుకోవాలి.’’ అంటూ పేర్కొన్నారు. రవి దహియా, భజరంగ్ పూనియా, సాక్షిమాలిక్‌లు లేఖ రాసినవారిలో ఉన్నారు.