ఏపీ శాసనసభలో తెదేపా ఎమ్మెల్యేలు ఈలలు వేయడం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీంతో స్పీకర్‌కి, తెదేపా ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చట్ట సభలో ఈలలు వేయడం ఏంటని స్పీకర్ తమ్మినేని సీతారం ప్రశ్నించగా, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఇంకేమీ చేయాలన్నారు. వారం రోజులుగా మీ ఎమ్మెల్యేల తీరు ఎలా ఉందో ఆత్మవిమర్శ చేసుకోవాలని స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. తదనాంతరం ఆరుగురు తెదేపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సారా మరణాలపై ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వలేదని సభాపతిపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.