ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పెగాసస్ వివాదం చెలరేగుతోంది. ఉదయం అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి పెగాసస్‌పై చర్చకు తెరలేపారు వైసీపీ నేతలు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చంద్రబాబు ఆ వైరస్‌ను కొనుగోలు చేశారని చెప్పడంతో ఈ వివాదం మొదలైంది. దీంతో ఏపీ అసెంబ్లీ.. హౌస్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు కానుంది.