దేశంలో ఎక్కడ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇస్తున్నామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఈ విధానాన్ని ప్రారంభంలో బాగానే అమలు చేసింది. కాని జిల్లాల పునర్విభజన, సిబ్బంది కొరత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు సెలవులు దొరకడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేయింబవళ్లు డ్యూటీ చేసినప్పటికీ విశ్రాంతి తీసుకునే సమయం దొరకడం లేదంటూ వాపోతున్నారు.