ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 11.31గంటలకు పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి రాగానే సీఎం జగన్ అతనితో సమావేశమై దీనిపై చర్చించనున్నారు. అనంతరం ఏప్రిల్ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.