ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల మరమ్మతు పనులను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రోడ్లు ముందు, తర్వాత చిత్రాలను చూపించే ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మే నెలాఖరు నాటికి రూ.3014 కోట్లతో ఎన్‌డిబి ఫేజ్-1లో 1244 కి.మీ రోడ్లను, డిసెంబర్‌లో ఎన్‌డిబి ఫేజ్-2 కింద రూ.3386 కోట్లతో 1268 కి.మీ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.జాతీయ రహదారులకు సంబంధించి మొత్తం రూ.30 వేల కోట్లతో 3079.94 కిలోమీటర్ల మేర 10 మీటర్ల మేర విస్తరించనున్నారు.