వివాదాస్పద 3 రాజధానుల విషయంలో వెనక్కి వెళ్లేది లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. నేడు అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అది మూడు రాజధానులతోనే సాధ్యమని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రభుత్వం 3 రాజధానులను ఏర్పాటు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పనిచేయడమే ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గమని అన్నారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని కేంద్రప్రభుత్వం కూడా తన అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొందని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి హామీ ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కూడా ఉదహరించారు. ఆ నివేదికను పరిగణనలోకి తీసుకుని తమ ప్రభుత్వం 3 రాజధానుల తీర్మానాన్ని ఆమోదించిందని సీఎం జగన్ తెలిపారు.