ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) మరో ఆరు నెలలు సమీర్ శర్మ కొనసాగనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మరోసారి పొడగించింది. ఇప్పటికే రిటైర్మెంట్ తర్వాత రెండుసార్లు ఆరు నెలల పాటు పదవీకాలాన్ని పొడగించగా.. ఇప్పుడు మరో 6 నెలలు పెంచింది. సమీర్ శర్మనే ఈ పదవిలో కొనసాగించాలన్న ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని కేంద్రంఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో నవబంర్ 30 వరకు అతడే సీఎస్‌గా కొనసాగనున్నాడు.