పార్టీ మారితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు : ఉప ముఖ్యమంత్రి

© File Photo

ఏపీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర పార్టీ మారడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. TDPలో జాయిన్ అయితే 30 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారని ఆరోపించారు. తనను పార్టీ మారాలని తీవ్రంగా ప్రయత్నించారని తెలిపారు. 2014 ఎలక్షన్స్ లో విజయనగరం సాలూరు నుంచి రాజన్న దొర గెలుపొందారు. ఆ క్రమంలో 23 మంది YSRCP ఎమ్మెల్యేలు టీడీపీలో జాయినయ్యారు. వారిలో పలువురికి మంత్రి పదవులు కూడా ఇచ్చినట్లు గుర్తు చేశారు. తాజాగా అప్పటి ఎన్నికల విషయాలను వెల్లడించారు.

Exit mobile version