ఏపీ డీజీపీ అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. డీజీపీ ఖాతాలో ఓ అశ్లీల ఫొటో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకొచ్చింది. ఈ వ్యవహారంపై విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ట్విటర్ అకౌంట్లోని అశ్లీల పోస్టులన్నింటినీ పోలీసులు తొలగించారు. కాగా ఈ అకౌంట్‌ను మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నప్పుడు ప్రారంభించారు. గత రెండేళ్లుగా ఈ ఖాతా యాక్టివ్‌గా లేదు. ప్రస్తుతం ఈ అకౌంట్‌ను హ్యాక్ చేసి అసభ్యకరమైన పోస్టులు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారు.