ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత, టీడీపీ నేత పొంగూరు నారాయణ అరెస్ట్ అయ్యారు. ఏపీలో పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజి వ్యవహారంలో నారాయణ స్కూల్స్ సిబ్బంది పాత్ర ఉందన్న ఆరోపణలతో అతడిని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో కొండాపూర్‌లో గల నారాయణ నివాసంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.