రహస్య భేటీలో మాజీ మంత్రులు..పార్టీని వీడతారా?

© File Photo

ఏపీలో నూతన మంత్రి వర్గ ఏర్పాటుకు ఇప్పటికే డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 11న కొత్త మంత్రి వర్గం ఏర్పాటు కానుంది. అయితే పాత మంత్రులను దాదాపు పూర్తిగా తొలిగించారు. ఈ క్రమంలో పలువురు మంత్రులు రహస్యంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఛాంబర్లో నలుగురు మంత్రులు రహస్య భేటీలో పాల్గొన్నారు. ఈ నలుగురు తమ భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చించినట్లు మరికొందరు అంటున్నారు. మరి వీరికి పదవులు రాకుంటే వైకాపాలో కొనసాగుతారా లేదా ఇతర పార్టీల్లోకి వెళతారో చూడాలి.

Exit mobile version