ఏపీలోని పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. కాగా ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పది పరీక్షలు జరగనున్నాయి. దాదాపు 6,55,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 3350 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్