ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు, కందుకూరు ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలు పెట్టడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.