పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రంపై ఏపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. ఈ మూవీకి సంబంధించిన బెనిఫిట్ షోలు, అదనపు షోలను వేయరాదని ప్రభుత్వం థియేటర్లకు నోటీసులు జారీ చేసింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు భీమ్లానాయక్ సినిమాకు మార్చి 11 వరకు ఐదు షోలకు అనుమతిని ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భీమ్లా నాయక్ విషయంలో ఏపీ అలా.. తెలంగాణ ఇలా అంటూ పలువరు అభిమానులు చర్చించుకుంటున్నారు.