ఉక్రెయిన్-రష్యా యుద్దం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలపై చమురు ధరలు ప్రభావం చూపుతున్నాయి. వంటనూనెల ధరలు సైతం ఆకాశన్నంటుతున్నాయి. సన్ ఫ్లవర్, పామాయిల్ ధరలు దాదాపు రూ. 200కు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ధరల తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ధరలను తగ్గించడానికి మున్సిపల్ మార్కెట్, ప్రభుత్వ ఔట్ లెట్ల ద్వారా ప్రభుత్వమే విక్రయించేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో 111మున్సిపాలిటీలను, 34 కార్పొరేషన్లను ఎంపిక చేసింది.