ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఉండాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొత్త వాహనాలకు మాత్రమే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఉంటుండగా.. పాత వాహనాలకు కూడా వాటిని బిగించాలని నిర్ణయం తీసుకుంది. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు లేకపోతే రూ. వేయి ఫైన్ విధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.